Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాపిల్ నుంచి తక్కువ ధరకే మ్యాక్ బుక్ ఎయిర్!

  • 13 అంగుళాల మోడల్
  • ఈ ఏడాది రెండో క్వార్టర్లో విడుదల అవకాశాలు
  • విశ్లేషకుడు మింగ్ చీ క్యూ అంచనా
యాపిల్ మరింత అందుబాటు ధరలోనే 13 అంగుళాల సైజున్న మ్యాక్ బుక్ ఎయిర్ ను ఈ ఏడాది విడుదల చేయనుంది. ఇది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ‘‘యాపిల్ నూతనంగా మ్యాక్ బుక్ ఎయిర్ ను తక్కువ ధరకు ఈ ఏడాది రెండో క్వార్టర్లో విడుదల చేసే అవకాశం ఉంది. దీన్ని త్వరలోనే చూడనున్నాం’’ అంటూ యాపిల్ గురించి వార్తలు అందించే ప్రముఖ విశ్లేషకుడు, కేజీఐ సెక్యూరిటీస్ కు చెందిన మింగ్ చీ క్యూ మీడియాకు వెల్లడించారు.

తక్కువ ధర కారణంగా మ్యాక్ బుక్ ఎయిర్ మరిన్ని అమ్ముడుపోతాయని అంచనా. మ్యాక్ బుక్ ఎయిర్ ను తొలిసారిగా 2008లో యాపిల్ అప్పటి సీఈవో స్టీవ్ జాబ్స్ విడుదల చేశారు. 2015 నుంచి దీనికి అప్ డేషన్ లేదు. దీనికి బదులు 12 అంగుళాల మ్యాక్ బుక్ ప్రోపై కంపెనీ దృష్టి సారించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 13 అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్ కు కాలేజీ విద్యార్థుల్లో మంచి ఆదరణ ఉంది. 128 జీబీ వెర్షన్ ధర 999 డాలర్లు.
apple mac book air

More Telugu News